నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
MHBD: జిల్లా కేంద్రంలోని కొత్త బజార్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ ఏఈ హరీష్ తెలిపారు. మెయింటెనెన్స్ పనులు పూర్తవ్వగానే విద్యుత్ సరఫరా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.