VIDEO: పెదనందిపాడులో దొంగల బీభత్సం
GNTR: పెదనందిపాడు మండల పరిధిలోని వరగాని గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాగునీటి చెరువు ఎదురుగా ఉన్న గంటా పాపారావు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పాపారావు దంపతులు కాకుమాను వెళ్లగా, ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని రూ. 30 వేల నగదు, అర సవర బంగారం, 13 గ్రాముల వెండిని దొంగిలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.