పెనుకొండలో ముగిసిన క్రికెట్, త్రో బాల్ పోటీలు

పెనుకొండలో ముగిసిన క్రికెట్, త్రో బాల్ పోటీలు

సత్యసాయి: పెనుకొండలో నిర్వహించిన ఉపాధ్యాయుల క్రికెట్, మహిళా ఉపాధ్యాయుల త్రోబాల్ పోటీలు బుధవారం ముగిసాయి. పురుషుల క్రికెట్ ఫైనల్ పోటీలలో రొద్దం, మడకశిర మండలాల జట్లు పోటీపడగా మడకశిర జట్టు ఫైనల్‌లో విజయం సాధించింది. మహిళల త్రోబాల్ పోటీల్లో పరిగి, హిందూపురం జట్లు ఫైనల్లో తలపడగా పరిగి జట్టు విజయం సాధించింది. విజేతలకు ఎంఈవోలు రాఘవయ్య, సుధాకర్ ట్రోఫీలు అందజేశారు.