VIDEO: వర్ధన్నపేటలో సివిల్ సప్లై హమాలీల సమ్మె
WGL: వర్ధన్నపేట పట్టణంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం సివిల్ సప్లై హమాలీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ విధులను బహిష్కరించారు. ఈ సమ్మెలో సివిల్ సప్లై ఏఐటీయూసీ హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షుడు జలగం బిక్షపతి, కార్యవర్గ సభ్యులు కొండేటి శ్రీనివాస్, జలగం రవి కొండేటి రవి, తదితరులు పాల్గొన్నారు.