నందివానివలసలో ఏనుగుల గుంపు సంచారం

నందివానివలసలో ఏనుగుల గుంపు సంచారం

PPM: గరుగుబిల్లి మండలం నందివానివలస చెరువులో ఏనుగులు గుంపు శనివారం తిష్టవేశాయి. వారం రోజులుగా సంతోషపురం, సుంకి, తోటపల్లి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలకు కంటినిండా కునుకులేకుండా చేస్తున్నాయి. ఏ క్షణంలో గ్రామంలో చొరబడి విధ్వంసం చేస్తాయోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. దూరప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.