అక్రమ కలప రవాణా.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
NRPT: మక్తల్ నియోజకవర్గంలో కలప అక్రమ రవాణా నిర్బంధం లేకుండా కొనసాగుతోంది. మాగనూరు మండలం వాడ్వాట్ సమీపంలో ఇటుకల బట్టీల నుంచి ట్రాక్టర్లలో కలప తరలిస్తున్నారని సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం అక్రమార్కులకు లాభంగా మారిందని, వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.