కోడిపందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి
GDWL: గట్టు మండలంలోని తుమ్మలపల్లి శివారులో కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7,300 నగదు, ఓ కోడిపుంజును స్వాధీనం చేసుకున్నట్లు SI శేఖర్ గౌడ్ తెలిపారు. పట్టుబడిన వారిలో ఇద్దరు ఆరగిద్దకు, ఒకరు తుమ్మలపల్లికి చెందిన వారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.