VIDEO: ఇంట్లో అగ్ని ప్రమాదం.. వృద్ధులకు తప్పిన ప్రాణాపాయం

VIDEO: ఇంట్లో అగ్ని ప్రమాదం.. వృద్ధులకు తప్పిన ప్రాణాపాయం

KKD: గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించి ఇంట్లో వస్తువులన్నీ కాలిబుద్దయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి మంచం, ఏసీ, డ్రెస్సింగ్ టేబుల్, దుస్తులు కాలిపోయినట్లు అగ్నిమాపక అధికారి అనిల్ కుమార్ తెలిపారు. రూ. 2లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. ఐతే ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న వృద్ధులకు ప్రాణాపాయం తప్పింది.