భద్రాచలం మినీ స్టేడియంకి రూ.4 కోట్లు: పీవో
BDK: భద్రాచలంలో రూ.4 కోట్లతో మినీ స్టేడియం నిర్మించనున్నట్లు ITDA పీవో బి.రాహుల్ తెలిపారు. ఇప్పటికే 5 ఎకరాల స్థలం కేటాయిస్తూ GO వచ్చిందని, తొలుత మంజూరైన రూ.2.50 కోట్లకు అదనంగా మరో రూ.1.50 కోట్లు మంజూరుకు క్రీడల శాఖ మంత్రి అంగీకరించారని వెల్లడించారు. నెల రోజుల్లో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఆయన పేర్కొన్నారు.