దసరా ఉత్సవాలను సమన్వయంతో నిర్వహించాలి: కలెక్టర్

దసరా ఉత్సవాలను సమన్వయంతో నిర్వహించాలి: కలెక్టర్

కోనసీమ: అమలాపురం పట్టణంలో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన దసరా ఉత్సవాలను అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో జిల్లా డివిజన్ స్థాయి పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, దేవాదాయశాఖ అధికారులు, ఉత్సవ కమిటీ పెద్దలతో సమావేశం నిర్వహించి, పలు అంశాలపై సమీక్షించారు.