సామెత - దాని అర్థం
సామెత: 'అన్నం కన్నా.. ఆదరణ ముఖ్యం'
అర్థం: అన్నం అరిగిపోతుంది.. ఆదరణ శాశ్వతంగా ఉంటుంది. అన్నదానం చాలా ఉత్తమమైనదని అంటారు. కానీ, తిన్న ఆ అన్నం ఒక్కపూటలో అరిగిపోతుంది. తిరిగి రెండో పూటకు ఆకలేస్తుంది. అయితే, ఆపదలో ఉన్నవాడిని ఆదరిస్తే అతడు ఆ ఆదరణను తన జీవితాంతం గుర్తుంచుకుంటాడు. ఇలాంటి సందర్బాల్లో ఈ సామెత వాడుతారు.