'మహిళలు సంఘటితంగా ముందుకు రావాలి'
VSP: అంతర్జాతీయ మహిళా దినోత‍్సవం సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. కుట్టు, కంప్యూటర్ శిక్షణ పొందుతున్న మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా క్రీడా అధికారిణి జూన్ గాలియట్ మాట్లాడుతూ.. మహిళలు క్రీడల్లో పాల్గొనాలన్నారు. ఆసరా చారిటబుల్ సొసైటీ అధ్యక్షురాలు సునీత మహిళలు శిక్షణ ద్వారా స్వయం సమృద్ధి సాధించాలన్నారు.