శ్రీవారి భక్తుల కోసం 16 వైద్య కేంద్రాలు
AP: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. భక్తులకు అవసరమైనప్పుడు నిమిషాల్లో వైద్యం అందేలా తిరుమలలో 16 వైద్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వైద్య కేంద్రాల్లో అన్ని వేళలా భక్తులకు వైద్య సేవలు అందనున్నాయి. అంతే కాకుండా 9 అంబులెన్సులు, మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల ద్వారా భక్తులకు వైద్య సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధమైంది.