రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: అగ్నిమాపక భద్రతవారోత్సవాల సందర్భంగా MBNR పట్టణంలోని ఫైర్ స్టేషన్ దగ్గర ఏర్పాటుచేసిన రక్తదానశిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారులు,సిబ్బంది సేవలను ఎమ్మెల్యే కొనియాడుతూ ప్రశంసించారు. అనంతరం రక్తదాతలకు ఎమ్మెల్యే ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.