ధర్మారంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి
PDPL: భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ధర్మారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేశ్వరి, ఉత్సవ కమిటీ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులుర్పించారు. దళిత, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి జగ్జీవన్ రామ్ కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.