ఫత్తేపూర్ సర్పంచ్ ఏకగ్రీవం
NZB: సాలురా మండలం ఫత్తేపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. సర్పంచ్ పదవికి ముగ్గురు నామినేషన్ వేయగా గౌస్, సద్దాం నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. దీంతో ఫత్తేపూర్ సర్పంచి పదవి ఎన్నికలు లేకుండానే నూర్ అహ్మద్ సొంతం చేసుకున్నాడు. నూర్ అహ్మద్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.