ముగిసిన పీపీఎల్ సీజన్–4
VSP: సంక్రాంతి సందర్భంగా ఆనందపురం మండలం పాలవలసలో జరిగిన పీపీఎల్ సీజన్–4 క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. విన్నర్స్‌గా గొరజాణ శ్రీను జట్టు, రన్నర్స్‌గా చందక శ్రీను జట్టు, మూడో స్థానంలో కోన ఆనంద్ జట్టు నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలను సీఐ రమేష్, ఎంపీటీసీ రౌతు వెంకట్రావు అందజేశారు.