వృద్ధులపై దాడి.. చర్యలకు ఆర్డీవో ఆదేశం

వృద్ధులపై దాడి.. చర్యలకు ఆర్డీవో ఆదేశం

నల్గొండకు చెందిన వృద్ధులు ముషం జగదీష్, బత్తుల ముత్తయ్యపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పద్మానగర్‌కు చెందిన కొందరు తమకు రావలసిన డబ్బులు అడిగినందుకు ఈ దాడి చేసారని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై బాధితులు RDOకు ఫిర్యాదు చేయగా, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం 24గంటల్లోగా రిపోర్ట్ సమర్పించాలని MROను కోరారు.