జలప్రవేశం చేసిన INS ఇక్షక్
కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్‌లో INS నౌక జల ప్రవేశం చేసింది. ఈ సందర్భంగా నేవల్ చీఫ్ త్రిపాఠి మాట్లాడుతూ.. INS ఇక్షక్ దేశ రక్షణలో సరికొత్త అధ్యాయమని పేర్కొన్నారు. 'ఇక్షక్.. నౌకా దళానికి దిక్సూచిగా నిలవనుంది. దీంతో సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు పడింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ సంస్థ ఇక్షక్ నౌకను 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది' అని అన్నారు.