నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న తహసీల్దార్

NRML: గోదావరి ఉగ్రరూపం ఉదృతంగా ప్రవహించడంతో కడెం మండలంలోని సారంగాపూర్ గ్రామ శివారులోని పంటలను తహసీల్దార్ ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కోల శ్రీనివాస్ తహసీల్దార్‌కు నీట మునిగిన పంట పంటలను చూయించి, నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శారద, జెట్టి నరసయ్య, లక్ష్మణ్ నరసయ్య, శ్రీనివాస్‌లు ఉన్నారు