'బైకర్' గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో రాజశేఖర్ సందడి
శర్వానంద్ హీరోగా దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా 'బైకర్'. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో సీనియర్ హీరో రాజశేఖర్ సందడి చేశాడు. ఈ గ్లింప్స్‌ని దర్శకుడు ముందే చూపించి ఉంటే హీరో పాత్రే అడిగేవాడినంటూ నవ్వులు పూయించాడు. సినిమా చాలా బాగా వచ్చినట్లు తెలిపాడు. కాగా, ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.