VIDEO: మూలమలుపులు ప్రమాదకరం.. సూచికలు ఎక్కడ?
GDWL: అలంపూర్ నుంచి గొందిమల్ల, భైరంపల్లి గ్రామాలకు వెళ్లే రహదారిలో మూలమలుపులు ప్రమాదకరంగా మారాయి. గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక సూచికలు ఇప్పుడు కనిపించకపోవడంతో రాత్రివేళ వాహనదారులు మలుపులను గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. రైతులు, ప్రజలు తరచుగా ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో వెంటనే సూచికలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.