సబ్సిడీలో రైతులకు పశుగ్రాస విత్తనాలు సరఫరా: ఏడి

NLR: ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు మండలాలకు పాడి రైతులకు 75% సబ్సిడీతోటి సిహెచ్ఎస్ 24 జొన్న రకము విత్తనాలను ప్రాంతీయ పశు వైద్యశాల ఇందుకూరుపేట ద్వారా సరఫరా చేయుచున్నారు. ఈ మేరకు ఇందుకూరుపేట ప్రాంతీయ వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.