'భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించేలా చూడాలి'

'భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించేలా చూడాలి'

CTR: సదుం మండలంలోని ఊటుపల్లె వద్ద నిర్మించిన ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని బాధితులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరారు. తిరుపతిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం వారు కలిశారు. 49 మంది రైతులు సుమారు 53 ఎకరాల భూమిని ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోయామని.. నిర్మాణం పూర్తయిన పరిహారం అందలేదని చెప్పారు.