INSPIRATION: లాల్ బహదూర్ శాస్త్రి
భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 'నిరాడంబరత, నిజాయితీ'కి నిలువెత్తు రూపం. ఆయన ఇచ్చిన 'జై జవాన్ - జై కిసాన్' నినాదం దేశానికి స్ఫూర్తినిచ్చింది. పదవి కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చిన గొప్ప దేశభక్తుడు. కష్ట సమయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత. సామాన్య జీవితం గడుపుతూ దేశాన్ని అగ్రపథాన నిలిపిన ఆయన జీవితం నేటికీ మనందరికీ పెద్ద స్ఫూర్తి.