బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ప్రకాశం: కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలోని దిగుడు బావిలో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభించింది. బావి నుండి దుర్వాసన రావడంతో స్థానికులు బావి వద్దకు వెళ్లి చూడగా నీళ్లలో మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.