VIDEO: 'పంచాయతీలకు సొంత ఆదాయ మార్గాలు'పై శిక్షణ
కోనసీమ: 'గ్రామ పంచాయతీలకు సొంత ఆదాయ మార్గాలు' అనే అంశంపై కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ రాయుడు మోహన్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో గ్రామ పంచాయతీలకు సొంత ఆదాయం మార్గాలను అన్వేషించి పన్నులు వసూలు చేయాలని తెలిపారు. రోడ్డు పక్కన ఉండే షాపులు నిర్వహించే వారికి ప్రభుత్వ ట్యాక్స్ గురించి వివరించాలన్నారు.