రైతన్న మేలుకో ముగింపు కార్యక్రమం
EG: జగ్గంపేట మండలంలో రైతన్న మేలుకో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ.. అన్నదాతల మేలు కోసమే 'రైతన్న మేలుకో' అనే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు తలపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు తమ సమస్యలను అధికారులకు తెలుపుకున్నారు.