VIDEO: దొడ్డి కొమురయ్య విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ
SRCL: తంగళ్ళపల్లి మండలం మండేపల్లి లో దొడ్డి కొమురయ్య విగ్రహ ప్రతిష్టకు సర్పంచ్ గదగోని సాగర్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ మొట్టమొదటి పోరాటయోధుడని కొనియాడారు. ఆయన తెలంగాణ కోసం చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ఆయనను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో మండేపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.