విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు

విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు

KDP: బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శరత్చంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నర్సింహారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.