'సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ELR: ఏలూరులో శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ నూర్జహాన్ పాల్గొన్నారు. 36వ డివిజన్లోని గుడివాడవారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో వ్యాపించే వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. గాలి, నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.