VIDEO: అబిడ్స్ సెంటర్లో వాహన తనిఖీలు
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అబిడ్స్ సెంటర్లో ఆదివారం సాయంత్రం టౌన్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇటీవల కాలంలో వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు టౌన్ ఎస్సై రమేష్ తెలిపారు. దాదాపు 20 పైగా కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పెండింగ్ చలనాలు మీద కూడా దృష్టి సారించామని తెలిపారు.