'చిన్నపిల్లల ఆధార్ నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు'

KDP: 6 సంవత్సరాల లోపు వయసు గల చిన్నారులు ఆధార్ నమోదు కోసం వారి తల్లిదండ్రులు పిల్లల జనన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని గ్రామ సచివాలయాలకు వెళ్లాల్సి ఉంటుందని చిట్వేలు MPDO మోహన్ తెలిపారు. శుక్రవారం చిట్వేలులో ఆయన మాట్లాడుతూ.. మే నెల 5వ తేదీ నుండి 8 వరకు, తిరిగి 12 నుండి 15వ తేదీ వరకు ఆధార్ నమోదు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.