ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి
అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో శనివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు, వినతులు స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.