విభిన్న ప్రతిభావంతుల ముగింపు క్రీడా దినోత్సవంలో జేసీ

విభిన్న ప్రతిభావంతుల ముగింపు క్రీడా దినోత్సవంలో జేసీ

W.G: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు-2025 సందర్భంగా బుధవారం భీమవరం డీఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ముగింపు వేడుకలు బుధవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గెలుపొందిన వారు మాత్రమే కాకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేతలేనన్నారు.