ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

SRPT: మునగాల మండలం నేలమర్రి-మాధవరం గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డుపై గురువారం ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ధాన్యం నేలపాలైంది. అరుగాలం శ్రమించి పండించిన ధాన్యం నేలపాలు అవ్వడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వారు కోరారు.