వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గురువారం మిర్చి తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.10 వేల ధర పలికింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి రూ. 10,500, తేజ మిర్చి ధర రూ.11 వేలు పలికింది. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించి మార్కెట్‌కు సరకులు తీసుకురావాలని అధికారులు సూచించారు.