రేపు షాద్ నగర్‌కు రానున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

RR: బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రమ్ శేఖర్ రేపు షాద్ నగర్‌కు రానున్నారు. పట్టణంలోని సాయిరాజ ఫంక్షన్ హాల్‌లో జరిగే జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడితో పాటు రాష్ట్ర కోఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని బీఎస్పీ నాయకులు తరలిరావాలని జిల్లా ఇన్‌ఛార్జ్ దొడ్డి శ్రీనివాస్ తెలిపారు.