VIDEO: మరోసారి మార్కెట్ వేలం పాట వాయిదా
అన్నమయ్య: తంబళ్లపల్లెలోని దినసరి మార్కెట్, వారపు సంత, ప్రైవేటు బస్టాండ్ వాహనాల టోల్ గేట్, తాత్కాలిక దుకాణాల రుసుము వసూలుకు సంబంధించి సోమవారం జరగాల్సిన వేలం పాట వాయిదా పడింది. ఈ వేలాన్ని ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసినట్లు పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు, హరిప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల వారు రూ.50 వేల డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని కోరారు.