'సీఎం చేనేతలకు ద్రోహం చేశారు'
నెల్లూరు జిల్లా పొదలకూరులోని మహ్మదపురంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేనేత కుటుంబాల సమస్యలపై స్పందించారు. సీఎం చంద్రబాబు చేనేతలకు ద్రోహం చేశారని విమర్శించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతన్న నేస్తం ద్వారా ప్రతి ఏడాది రూ. 24 వేల సాయం అందించారని పేర్కొన్నారు. చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు జరగడం లేదని ఆయన తెలిపారు.