92 రోజుల్లో ఏడు శిఖరాలు.. విశాఖ వాసి గిన్నిస్ రికార్డ్
విశాఖపట్నానికి చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. ప్రపంచంలోని ఏడు ఎత్తైన అగ్నిపర్వత శిఖరాలను(Seven Volcanic Summits) అత్యంత వేగంగా అధిరోహించిన పురుషుడిగా నిలిచారు. ఈ అద్భుత ఘనతను కేవలం 92 రోజుల, 4 గంటల, 45 నిమిషాల్లోనే పూర్తి చేసి భారత్ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. అన్మిష్ సాధించిన ఈ విజయం దేశానికి ఎంతో గర్వకారణం.