తెనాలిలో మహిళపై దాడి… వివరాలు వెల్లడి
GNTR: తెనాలిలో కందుకూరు ఉషపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, నిందుతుడు ఆమెతో సహజీవనం చేస్తున్న విజయ్‌గా గుర్తించారు. అనుమానాలతో గతంలో నందిగామలో కూడా ఒకరిని హతమార్చిన విజయ్, మరో వ్యక్తితో ఉందన్న కోపంతో ఉషపై దాడి చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఉష ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.