నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

SKLM: పోలాకి మండలంలోని నదీ తీర ప్రాంతాలను మండల ప్రత్యేక అధికారి ఎల్ వెంకట మధు పరిశీలించారు. సోమవారం సాయంత్రం రాజారాంపురం, పల్లి పేట, గుప్పెడు పేట, తదితర నదీ పరివాహక ప్రాంతాలతోపాటు తుఫాన్ షెల్టర్లను మండల అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ నేపథ్యంలో నదీ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.