VIDEO: 'అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి'

SRPT: అర్హులైన పేదలందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సైదులు డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని, ఎంపికలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.