సూర్యపేట కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

సూర్యపేట కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు.