విషాదం.. ఫిట్స్‌తో యువరైతు మృతి

విషాదం.. ఫిట్స్‌తో యువరైతు మృతి

NGKL: బిజినేపల్లి మండలంలో విషాద ఘటన జరిగింది. పోలేపల్లి గ్రామంలో యువరైతు సవారీ కృష్ణ (42) మృతి చెందాడు. తన రెండు ఎకరాల మక్కచేను పొలంలో రాత్రి నీళ్లు పెట్టడానికి వెళ్లిన సమయంలో ఫిట్స్ రావడంతో కృష్ణ మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం 8 గంటలకు తండ్రి రాకపోవడంతో పెద్ద కుమారుడు పొలానికి వెళ్లి చూడగా విగత జీవిగా పడి ఉన్నాడు. భార్య నారమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.