'నిస్వార్ధంగా పనిచేసే అభ్యర్థులనే గెలిపించాలి'
NLG: ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసే అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు విజ్ఞప్తి చేశారు. చిట్యాల మండలం చిన్నకాపర్తిలో గురువారం సర్పంచ్ అభ్యర్థిగా సీపీఎం మద్దతుతో పోటీ చేస్తున్న రూపని ఇద్దయ్య గెలుపు కోసం నిర్వహించే ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.