వచ్చే ఏప్రిల్ లోపు రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు
MBNR: దేవరకద్ర నియోజకవర్గానికి ఇప్పటి వరకు 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేశామని, వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో రెండవ విడత మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. కౌకుంట్ల మండలం తిరుమలాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారురాలు వడ్ల మంగమ్మ నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు హాజరై ప్రారంభించారు.