VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు
WGL: ఖిల్లా వరంగల్ మండలం మామునూర్ పోలీస్ ఫోర్త్ బెటాలియన్ కళాశాల ఎదుట జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్ధన్నపేట నుంచి వరంగల్‌కు వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం ధ్వంసమై, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.