'పోలీస్ కార్యాలయానికి 50 ఫిర్యాదులు'
AKP: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారి వేదికకు 50 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూతగాదాలు-34, కుటుంబ కలహాలు-2, మోసపూరిత వ్యవహారాలు-3, ఇతర విభాగాలకు చెందినవి-11 ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వీటిపై విచారణ నిర్వహించి వారం రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.